సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటివరకు 17 కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. పటాన్‌చెరు పట్టణంలో కరోనా మహమ్మారితో ఇవాళ మరో వ్యక్తి మరణించాడు. మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
పటాన్ చెరు పట్టణంలోని ఇప్పటివరకు కరోనాతో ఐదుగురు మరణించడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్లు లేని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి : కొవిడ్ పరీక్ష చేయించుకున్న ఓవైసీ.. రిపోర్టులో ఏముందంటే..!