ETV Bharat / state

జహీరాబాద్​లో కరోనా కేసు.. రెడ్​జోన్​లోకి మూసానగర్​ కాలనీ - కొవిడ్​-19 తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కొత్తగా కొవిడ్​ పాజిటివ్​ కేసు నమోదైంది. మూసానగర్​ కాలనీకి చెందిన 38 ఏళ్ల వ్యక్తి మహమ్మారి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ కాలనీ సహా అర కిలోమీటరు పరిధి వరకు రెడ్​జోన్​గా ప్రకటించారు. ​ఆర్డీవో రమేశ్​ బాబు, మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ నాగేశ్వరరావు, పోలీసు అధికారులు మూసానగర్ కాలనీలో పర్యటించి ప్రజలకు సూచనలు చేశారు.

జహీరాబాద్​లో కరోనా కేసు.. రెడ్​జోన్​లోకి మూసానగర్​ కాలనీ

author img

By

Published : May 29, 2020, 5:51 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. జహీరాబాద్ పట్టణంలోని మూసానగర్ కాలనీకి చెందిన 38 ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్ కేసు వెలుగులోకి రావడం వల్ల కాలనీలో రాకపోకలు పూర్తిగా నిషేధించారు.

కాలనీ సహా అర కిలోమీటరు పరిధిలోకి వచ్చే అన్ని ఇళ్లు, కాలనీలను రెడ్ జోన్​లోకి చేరుస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ కేసు నమోదు విషయం శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ ఆర్డీవో రమేశ్​ బాబు, మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ నాగేశ్వరరావు, పోలీసు అధికారులు మూసానగర్ కాలనీలో పర్యటించి ప్రజలకు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.