తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వట్పల్లి మండలం మరవవెళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్.. కూలి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత రెండేళ్ల క్రితం తాగినమత్తులో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
మళ్లీ మద్యానికి బానిసైన శ్రీనివాస్ ప్రతిరోజు కుటుంబసభ్యులతో గొడవ పడేవాడు. రోజు మాదిరిగానే మద్యం సేవించి వచ్చి ఇంటి ముందు పడిపోయాడు. గమనించిన అతని తల్లి పద్మమ్మ అన్నం తినిపించి వాకిట్లోనే పడుకోబెట్టింది. అర్ధరాత్రి కనిపించకపోవడం వల్ల.. ఊళ్లో వెతకగా ఓ సెల్టవర్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా