సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో పదో తరగతి పరీక్షలు సమన్వయ కమిటీ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలు జరుగుతున్నందున అధికారులు జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిధిలోని పరీక్షా కేంద్రాలను శానిటైజేషన్ చేయించాలని పేర్కొన్నారు.
అధికారులకు సూచనలు
- అన్ని పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థి మాస్క్ ఖచ్చితంగా ధరించాలని తెలిపారు.
- జిల్లా వ్యాప్తంగా 108 పరీక్ష కేంద్రాలున్నాయని.. 11537 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ వెల్లడించారు.
- జూన్ 8నుంచి జులై 5 వరకు జరిగే పరీక్షలకు అన్ని శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- విద్యార్థులకు సమయానికి హాల్ టికెట్స్ అందే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
- పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండి అవసరమైన ప్రాథమిక కిట్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
- ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. పోలీస్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భ్రదత చర్యలు చేపట్టాలన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్