సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద మాస్కులు ధరించని వారికి మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు. భూములు, ఇళ్ల స్థలాల కొనుగోలు విక్రయాలు ప్రారంభించడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుంటున్నారు.
లాక్డౌన్ నింబంధనలు మరిచిపోయిన జనాలు... ఇష్టారీతిన వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు చెబుతున్నా ఎవరు పట్టుంచుకోవడం లేదు. స్టాంప్ వెండర్లు కూడా మాస్కులు లేకుండానే పనులు చేస్తున్నారు. ఈ తంతు చూసిన అధికారులు తొలుత వారికే అధికారులు జరిమానా విధించారు.