ETV Bharat / state

NO GOVT SCHEMES: ఆ గ్రామస్థులకు అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా రైతుల సంక్షేమానికే పెద్ద పీట వేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా వంటి వినూత్న పథకాలను అమలు చేస్తోంది. కానీ ఆ గ్రామంలోని రైతులకు మాత్రం ఈ సంక్షేమ ఫలాలు ఏవీ అందడం లేదు. ప్రభుత్వ పథకాలు కాదు కదా.. తరతరాలుగా వస్తున్న భూములను సైతం అమ్ముకోలేని దుస్థితి. ఇది ఏ ఊరో.. ఆ రైతుల బాధ ఏంటో తెలుసుకుందాం..!

NO GOVT SCHEMES
ఆ గ్రామస్థులకు అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు
author img

By

Published : Jun 26, 2021, 4:30 PM IST

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పీచార్యాగడి గ్రామంలో మంచి సారవంతమైన పొలాలు ఉన్నాయి. ఇక్కడి రైతులు ఆహార పంటలతో పాటు చెరకు, అల్లం వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల వ్యవసాయ సంక్షేమ పథకాలు పొందే అర్హతలు వీరికి ఉన్నాయి. అయినా అవేవీ అమలు కావు. దీనికి కారణం అధికారులు చేసిన పొరపాటు. ఈ గ్రామంలోని భూములు వక్ఫ్​ పరిధిలోకి వస్తాయని అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదిక వీరికి శాపమైంది.

తీవ్ర కష్టాల్లో అన్నదాతలు

పీచార్యాగడి గ్రామంలోని సర్వే నెంబర్ 50లో 2,181 ఎకరాల భూములున్నాయి. ఎన్నో ఏళ్లుగా రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. క్రయవిక్రయాలూ సైతం సాగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు కొత్త పాసుపుస్తకాలూ అందించింది. ప్రారంభంలో మూడు సార్లు రైతు బంధు సాయమూ దక్కింది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఇవన్నీ వక్ఫ్‌ భూములేనంటూ 2,181 ఎకరాలను ఆ జాబితాలో చేర్చడంతో ఒక్కసారి పట్టాదారులంతా తీవ్ర కష్టాల్లో పడ్డారు.

నిలిచిపోయిన సంక్షేమ ఫలాలు

ఈ భూములను వక్ఫ్ జాబితాలో చేర్చడంతో రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. రైతుబంధు, రైతుబీమాతో పాటు పంటరుణాలు కూడా వీరికి అందడం లేదు. రైతుబంధు రూపంలో ఈ రైతులు ప్రతి సంవత్సరం 2కోట్ల 18లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఇటీవలి కాలంలో ముగ్గురు రైతులు చనిపోయారు. రైతుబీమా రక్షణ కూడా వీరికి లేకుండా పోయింది. ఏదైనా అత్యవసరానికి భూమి అమ్ముకునే అధికారం కూడా వీరికి లేదు.

మంత్రి ఆదేశించినా..

ఈ భూములు వక్ఫ్​కు చెందుతాయని జారీ చేసిన గెజిట్‌లో ఇబ్రహీంపూర్‌ అలియాస్‌ పీచార్యాగడి అనే ఊరి పేరును ప్రస్తావిస్తూ ఈ సర్వే సంఖ్యలు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ మండలంలో అసలు ఇబ్రహీంపూర్‌ అనే గ్రామమే లేదు. జరిగిన తప్పును సరిదిద్ది తమకు న్యాయం చేయాలంటూ అన్నదాతల చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. తమ సమస్యను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా.. రైతులకు పాసుపుస్తకాలు ఇచ్చేసి, ఆన్‌లైన్‌లో పేర్లు పునరుద్ధరించాలని గత వేసవి సీజన్ ప్రారంభంలోనే అధికారులను ఆదేశించారు. అయినా ఇప్పటికీ సమస్యకు పరిష్కారం దక్కలేదు.

పరిష్కరిస్తే అన్నదాతలకు మేలు

ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీరి సమస్యపై దృష్టి సారించి పరిష్కరిస్తే అన్నదాతలకు మేలు జరుగుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు చేసిన తప్పు వారిపాలిట శాపమైంది. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: Webinar:ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి ఒడిగట్టారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.