సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు అవస్థలు పడ్డారు. పటాన్చెరు శివారు బాహ్య వలయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షంలో తడిసిపోయింది.
అనుకోకుండా పడ్డ భారీ వర్షంతో తీరని నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి బాధిత రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి సూచించారు.
ఇదీ చూడండి: కరోనా భయంతో బెంబేలెత్తుతున్న రేషన్ డీలర్లు