జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) నిమ్జ్ ప్రాజెక్టు రెండో విడత భూసేకరణ నిలిపివేయాలని కోరుతూ రైతులు నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్ శివారులో భూబాధితులు సమావేశమయ్యారు. ఈనెల 10న చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం రద్దు చేసి సాగు చేసుకుంటున్న భూములను రైతులకు వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు.
జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి ఏర్పాటుకు వ్యతిరేకం కాదని... సాగు భూములు మినహా బీడు భూములను సేకరించుకోవాలని రైతులు కోరారు. భూసేకరణ చేపడితే మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం పంపిణీ చేసి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కోరారు.