రైతుకు అండగా తెరాస ప్రభుత్వం నిలుస్తోందని మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ హారిక విజయ్ కుమార్ అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతానికి రైతుబంధు, రైతు బీమా, నియంత్రిత సాగు విధానాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆ ఘనత తెరాసదే..
జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని అన్నదాతలను ఘనంగా సన్మానించారు. పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర చెల్లించి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసిన ఘనత తెరాసకే దక్కిందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. 14 ఎకరాల్లో 10 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారని తెలిపారు.