సొంత బాబాయిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి చాకలి వెంకయ్యను కుటుంబ గొడవల నేపథ్యంలో అన్న కొడుకు చాకలి గోపాల్ హత్య చేశాడు.
వర్షపు నీటి వద్ద చిన్న గొడవ కాస్త పెద్దదై హత్యకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. హత్యకు కారణాలు తెలుసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం