సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ నాగార్జున కాలనీలో దారుణం చోటుచేసుకుంది. సుబ్బరాజు తన భార్య, పదేళ్ల కొడుకుపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో కుమారుడు మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. లక్ష్మీ జ్యోతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. లక్ష్మీ జ్యోతిని కొద్ది నెలల క్రితమే రెండో పెళ్లి చేసుకున్న సుబ్బరాజుపై గతంలో పలు హత్యకేసులు ఉన్నాయి.
ఇవీ చూడండి : పూజలు చేస్తామన్న కిలాడీ లేడీలకు బడితె పూజ..