జహీరాబాద్‌లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించని ఓ హోటల్‌ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని పలు హోటల్లను అధికారులు తనిఖీ చేశారు.
పరిసరాల శుభ్రత పాటించకపోవడం, వంటశాల మసిగా ఉడడం, పాత్రలు సరిగా లేకపోవడం వంటి పలు కారణాలతో... ఓ హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయించి వంటశాల, ప్రధాన గదికి తాళం వేశారు.