ETV Bharat / state

ముంబయి పోయిన కూలీలు.. ఇంటికి రానికి తంటాలు

సొంత ఊరిలో ఉపాధి లేక.. బతుకు దెరువు కోసం బొంబాయికి పోయిన వలస జీవి.. లాక్​డౌన్​తో అల్లాడిపోతున్నాడు. ఉన్న ఊరిలో పనిలేక.. తినడానికి తిండి లేక.. పురిటి గడ్డకు రాలేక నానా అగచాట్లు పడుతున్నాడు. దవాఖానా, ఠాణాల చుట్టూ తిరిగి.. తిరిగి.. అనుమతి పత్రం సంపాదిస్తే. ఇన్నాళ్లు సంపాదించిన నాలుగు పైసలు ఇంటికి రావడానికి కిరాయికే అయిపోతున్నాయి. ఉపాధి కోసం ముంబయి మహా నగరానికి వెళ్లిన తెలుగువాళ్లు పడుతున్న ఇబ్బందులపై తెలంగాణ-కర్నాటక సరిహద్దు చెక్​పోస్టు నుంచి ఈటీవీ భారత్​ తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం

MUMBAI's migrant workers problems in journey to telangana
ముంబయి పోయిన కూలీలు.. ఇంటికి రానికి తంటాలు
author img

By

Published : May 16, 2020, 3:08 PM IST

ముంబయి పోయిన కూలీలు.. ఇంటికి రానికి తంటాలు

తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం మహారాష్ట్రకు లక్షల సంఖ్యలో వలస వెళ్లారు. వీరిలో అత్యధిక శాతం చిన్న చితక పనులు చేసుకుంటూ ముంబయిలోనే జీవిస్తున్నారు. లాక్​డౌన్ వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. మళ్లీ మాములు రోజులు వస్తాయి.. పనులు దొరుకుతాయన్న ఆశతో.. కూడబెట్టుకున్న నాలుగు రూపాయలతో ఇన్ని రోజులు గడిపారు. 50 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో వైపు రోజురోజుకూ మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటం వల్ల చేసేందుకు పనులు దొరకడం లేదు. తినేందుకు తిండి లేక.. కష్టకాలంలో ఆదుకునే దిక్కు లేక.. సొంత ఊర్ల బాట పడుతున్నారు. హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారిపై తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న చిరాగ్​పల్లి చెక్​పోస్టు నుంచి రోజూ సుమారు వెయ్యి మంది వస్తున్నారు.

అనుమతి పత్రాలు జారీ చేయడం లేదని ఆవేదన

మెడికల్ సర్టిఫికెట్​తో పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప ఊరేళ్లెందుకు అనుమతి పత్రం దొరకడం లేదు. ముంబయి నుంచి స్వస్థలం రావడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించడం లేదు. మహారాష్ట్ర పోలీసులు అనుమతి పత్రాలు జారీ చేయడం లేదని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు అనుమతి పత్రం పొందినా.. ఛార్జీలు భరించలేని స్థాయిలో ఉంటున్నాయి. సాధారణ రోజుల్లో బస్సులో రావడానికి వెయ్యి రూపాయలు ఛార్జీ వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం దూరాన్ని బట్టి రూ. 5 వేల నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నారని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏలాంటి సాయం అందలేదని..

మహారాష్ట్ర ప్రభుత్వం తామకు ఏలాంటి సాయం చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం వంటి కనీస నిత్యవసరాలు కూడా అందించడం లేదంటున్నారు. బస్సు ఛార్జీలు భరించలేని వాళ్లు అక్కడే ఇబ్బందులు పడుతూ.. ఆకలితో అల్లాడుతున్నారని వీరు వివరిస్తున్నారు. కొంతమంది అప్పు చేసి మరీ సొంత ఊర్లకు వస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముంబయిలో ఉన్న కార్మికులపై దృష్టి సారించి.. స్వస్థలాలకు రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మన కార్మికులపై దృష్టి సారించాలి. వారిని స్వస్థలాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తే కొన్ని వేల మంది తమ ఊర్లకు చేరుకుంటారు.

ఇదీ చూడండి : మండుటెండల్లో ఒడిశా వలసకూలీల పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.