కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలు త్వరగా కోలుకోవాలని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. హోమంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు పాల్గొన్నారు.
లోక కల్యాణార్థం ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్.. 40 రోజుల పాటు హోమం నిర్వహించడం అభినందనీయమని జడ్పీ సీఈవో కొనియాడారు. వేద మంత్రోచ్చారణల నడుమ కొనసాగిన మృత్యుంజయ హోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమంతో ముగించారు.
ఇదీ చదవండి: పాతబస్తీలో పహారా... గుర్రం ఎక్కిన నగర సీపీ