MRF India Expansion : పారిశ్రామిక రంగంలో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా తెలంగాణలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌ను... ఆ కంపెనీ ఎండీ అరున్ మమెన్ కలిసి ఈవిషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనఊరు-మన బడి కార్యక్రమానికి సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద రూ.4 కోట్లు ఇస్తున్నట్లు మమన్ తెలిపారు. ఈ ప్రకటనల పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున