ప్రతి తెరాస కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గ్రామగ్రామాన సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని నేతలకు సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో నిర్వహించిన తెరాస సభ్యత్వ కార్యక్రమంలో పాటిల్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.
నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. అన్ని మండలాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ సభ్యత్వ నమోదు నిర్వహించాలని సూచించారు.
ఇదీ చూడండి: తెరాస ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది: రామచందర్ రావు