ETV Bharat / state

కేంద్రం 400 కోట్లు ఇస్తే.. 250 కోట్లు తినేశారు: ఎంపీ అర్వింద్​ - ఎంపీ అర్వింద్​ తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా భారతినగర్​లో భాజపా అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి తరఫున నిర్వహించిన రోడ్​ షోలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేసీఆర్​ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి.. ముంచేశారని ఆరోపించారు.

MP
కేంద్రం 400 కోట్లు ఇస్తే.. 250 కోట్లు తినేశారు: ఎంపీ అర్వింద్​
author img

By

Published : Nov 28, 2020, 2:30 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్​ దోచుకున్న సొమ్మును తీసుకోగా.. మిగిలిన చిల్లర మంత్రి హరీశ్​రావు తీసుకుంటున్నారని ఎంపీ అర్వింద్​ ఘాటుగా ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా భారతినగర్​లో భాజపా అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి తరఫున నిర్వహించిన రోడ్​ షోలో పాల్గొన్నారు.

తొలుత గుజరాత్​ను అభివృద్ధి చేసిన మోదీ... ప్రస్తుతం దేశాన్ని అభివృద్ధి చేస్తూ.. ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మాత్రం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ముంచేశారని ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భాజపానే అధికారంలోకి వస్తోందని... అప్పుడు వ్యవస్థను బాగుచేస్తామని వెల్లడించారు. కేంద్రం రూ.నాలుగు వందల కోట్లు ఇస్తే.. రూ.250 కోట్లు తినేశారని ఆరోపించారు. ఎన్నికల్లో భాజపాను గెలిపించి.. తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.