ETV Bharat / state

ఆ మూడు డివిజన్లలో తెరాస ఓటమి ఖాయం: రఘునందన్​ - sangareddy district latest news

భాగ్యనగరంలో భాజపా జెండా ఎగరేస్తుందనే భయంతోనే ప్రభుత్వం గ్రేటర్​ ఎన్నికల నోటిఫికేషన్​కు తెరలేపిందని ఎమ్మెల్యే రఘునందన్​రావు విమర్శించారు. జీహెచ్​ఎంసీలో అన్ని చోట్ల తెరాసకు ప్రత్యామ్నాయం తమ అభ్యర్థులే అని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్​ మహిళా కార్యదర్శి గోదావరిని భాజపాలోకి ఆహ్వానించారు.

mla raghunandan invites activists into bjp
ఆ మూడు డివిజన్లలో తెరాస ఓటమి ఖాయం: రఘునందన్​
author img

By

Published : Nov 19, 2020, 9:47 AM IST

బల్దియాపై భాజపా జెండా ఎగర వేస్తుందనే భయం, ఆందోళనతోనే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్​కు తెరాస ప్రభుత్వం తెరలేపిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శి గోదావరి భాజపాలోకి ఆహ్వానించేందుకు ఆమె నివాసానికి నాయకులతో కలిసి రఘునందన్​ వెళ్లారు. గత ఎన్నికల్లో భారతీయ నగర్​లో తక్కువ ఓట్లతో ఓడిపోయి తెరాసకు బలమైన దీటుగా నిలిచిన గోదావరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె వస్తే భారతీ నగర్​లో భాజపా గెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు.

తెరాసకి ఓటమి తప్పదు

పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు డివిజన్లలో తెరాస ఓడిపోతుందని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. కారణం దుబ్బాకలో ఉన్న వారే ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఆ మూడు డివిజన్లలో తెరాస ఓటమి ఖాయం: రఘునందన్​

విజ్ఞులు కలిసి రావాలి

భారతీ నగర్​లోనే కాకుండా గ్రేటర్​లో అన్ని చోట్ల తెరాసకు ప్రత్యామ్నాయం తమ అభ్యర్థులే అని నిరూపించే రీతిలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని రఘునందన్​ చెప్పారు. గ్రేటర్​లో అన్ని సీట్లు గెలుచుకుని బల్దియాపై భాజపా జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. దీనికి విజ్ఞులు, మేధావులు కలిసి రావాలని కోరారు.

ఇదీ చదవండి: వందేళ్ల సమస్యలకు తెరాసతోనే మోక్షం: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.