ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దుల్లో హైఅలర్ట్..టెస్టులు చేసిన తర్వాతే అనుమతి - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే అనుమతిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని చిరాగ్​పల్లి వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మాణిక్యకావు సందర్శించారు.

MLA Manikya Rao visits corona
సరిహద్దు ప్రాంతంలో వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
author img

By

Published : Mar 20, 2020, 8:17 AM IST

తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కరుణ తనిఖీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మాణిక్యరావు సందర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్​పల్లి వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గత రెండు రోజులుగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. శిబిరాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులు కార్లు సరుకు రవాణా వాహన డ్రైవర్లకు నిర్వహిస్తున్న కరుణ పరీక్షలను పరిశీలించారు.

సరిహద్దు ప్రాంతంలో వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

రాష్ట్ర సరిహద్దులోకి వాహనాలు చేరుకోగానే రవాణా శాఖ చెక్​పోస్ట్​ అధికారులు ముందుగా ప్రయాణికులు, డ్రైవర్ల చేతులు శుభ్రం చేయించాలని సూచించారు. వైద్యశాఖ చెక్​పోస్ట్ వద్ద అంతరాష్ట్ర ప్రయాణికులకు మాస్కులు, శానిటైజర్లు అందజేసి ఆరోగ్య సూత్రాలు సూచించాలని తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించిన ఎమ్మెల్యే... వైద్య శిబిరం వద్ద కనీసం ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండి కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే శిబిరానికి తరలించేలా చూడాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.