కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించి.. వారిలో ఆత్మస్థైర్యం నింపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు వైద్యులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మాతా, శిశు వార్డులు సహా ఐసోలేషన్, కొవిడ్ వార్డులను సందర్శించారు. కరోనా పరీక్షల కిట్లు, అవసరమైన మందుల నిల్వలపై ఎమ్మెల్యే వైద్యులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు నాణ్యమైన భోజనం అందించి.. త్వరగా కోలుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు