ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదలకు పెన్నిదిలా మారిందని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 10 మంది లబ్ధిదారులకు రూ.2.97 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి.. రూ.వేలు ఖర్చు చేసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండనిస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థిక సహాయం అందుకున్న లబ్ధిదారులు.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మాణిక్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: CS: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: సీఎస్