సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో తన కుటుంబసభ్యులతో టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మొదటి డోసు వేయించుకున్న ప్రతి ఒక్కరూ.. రెండో డోసు విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి దంపతులు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దంపతులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు వ్యాక్సిన్ చేయించుకున్నారు.
ఇదీ చూడండి.. తెలుగు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించేందుకు 'మేఘా' సిద్ధం