ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేశ్ దేవస్థానంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం కోటి వృక్షార్చనలో భాగంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. వాటిని సంరక్షించాలని అధికారులకు సూచించారు.
పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కర్థనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.