భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న కేసీఆర్ సర్కారును రైతులు ఆశీర్వదించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన 152 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. నకిలీలకు తావులేకుండా బార్ కోడ్ విధానంతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు బీమా సౌకర్యం కల్పించి కర్షకులకు కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు.
ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం