సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట పురపాలికను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఇటీవలే జోగిపేట అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.14.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న పురపాలక ఎన్నికల్లో తెరాస జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే ధీమావ్యక్తం చేశారు. ఈ నిధులతో భూగర్భ మురుగు కాల్వలు, మంచినీటి సరఫరా వంటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
ఇవీ చూడండి : 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'