సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. సరైన భోజనం, మౌలిక వసతులు కల్పించడం లేదని ఇటీవల విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ కళాశాలలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. విధుల్లో అలసత్వం వహించడంపై ప్రిన్సిపల్ను మందలించారు. సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.
ఇవీచూడండి: మేక కోసం వచ్చి చిక్కిన కొండచిలువ!
బుదేరా గురుకుల డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే - సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా గురుకులాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధ్యాపకులను మందలించారు.