సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఎన్నోసార్లు కేసీఆర్ను అడిగినట్లు తెలిపారు. రేపు అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావించనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ప్రజలు కరోనాతో ఆర్థికంగా నష్టపోయారని... ప్రజల ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులందరం ప్రశ్నలు లేవనెత్తామని తెలిపారు. కరోనా వచ్చిననాటి నుంచి ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వానికి సూచించనట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'శ్రావణి ఆత్మహత్యకు కారణం వాళ్లే... ఆధారాలున్నాయ్'