కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి, రోగులకు పౌష్టికాహారం అందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం గాంధీ ఆసుపత్రికి రూ. 3వేలు, జిల్లా ఆసుపత్రులకు రూ. 2వేల కోట్ల నిధులు కేటాయించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడిన తర్వాతనే డ్యామ్‌లు నిర్మించాలని హితవు పలికారు.
గాంధీ ఆసుపత్రికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతున్నాయని... ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో కూడా ఎలాంటి సదుపాయాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రులతోపాటు గాంధీలోనూ సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై సీఎం నివేదిక తెప్పించుకోవాలని పేర్కొన్నారు. దాతలు ఇచ్చిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.