ఇప్పట్లో రాజకీయ విమర్శలకు తావులేదని.. రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే ముఖ్యమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఏవిధంగా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారో.. అదే విధంగా ప్రజలు కూడా క్షేమంగా ఆస్పత్రుల నుంచి బయటకు రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అపాయింట్మెంట్ ఇవ్వాలి
కొవిడ్ చికిత్స పొందుతున్న బాధితుల్లో చాలా మంది ఆక్సిజన్ అందకపోవడం వల్లనే చనిపోతున్నారని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నందున పార్టీ ప్రతినిధులందరూ కేసీఆర్‌ను కలిసి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయనను అపాయింట్‌మెంటు కూడా అడిగినట్లు చెప్పారు. అపాయింట్‌మెంటు ఇవ్వని పక్షంలో ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. .
మీకే మంచి పేరు
ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ తీసుకోవడంతో ఆయనను కలవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తమ పార్టీ సలహాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తే.. వచ్చే మంచి పేరు సీఎంకేనని ఆయన హితవు పలికారు.
ఇదీ చదవండి: 14 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీరుతెన్నులు