సంగారెడ్డికి సాగు, తాగు నీరు ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శాసన సభలో కేసీఆర్ మాట్లాడిన మాట తనకు చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ పార్టీకి చెందిన వారైనా మంచి పని చేస్తే ప్రశంసించాల్సిందేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఏపని చేసినా కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత అభివృద్ధికోసం కాంగ్రెస్ అనేక ప్రాజెక్టులు నిర్మించిందని తెలిపారు. ప్రజలందరికీ తాగు, సాగు నీరు ఇవ్వడంలో కేసీఆర్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: దేశ ఆర్థిక వృద్ధిలో తెలంగాణది ముఖ్యపాత్ర: సీఎం కేసీఆర్