ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణం నాణ్యంగా జరగాలి: ఎమ్మెల్యే - ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా నాగధర్‌లో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి భూమి పూజ చేశారు. వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. నిర్మాణ పనులు నాణ్యంగా జరిగేలా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

రైతు వేదికల నిర్మాణం నాణ్యంగా జరగాలి: ఎమ్మెల్యే

author img

By

Published : Jul 8, 2020, 1:30 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హర్‌ మండలం నాగధర్‌లో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయడంలో భాగంగా వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. నిర్మాణ పనులు నాణ్యంగా జరిగేలా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సాగును లాభసాటిగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి తెలిపారు.

అనంతరం కల్హర్, నారాయణ ఖేడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన ఆయన నిర్మాణం పూర్తి చేసుకున్న రోడ్లు, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డులను ప్రారంభించారు. నియోజకవర్గంలో జరిగే పనులను రైతుబంధు సమితి ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు దృష్టిసారించాలని సూచించారు. నిర్మాణ పనులు మెరుగ్గా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ప్రైవేట్​లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.