కరోనా వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కరోనా కట్టడి చర్యలను ఆయన పర్యవేక్షించారు. మంత్రితోపాటు కలెక్టర్ హనుమంతరావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, జడ్పీ ఛైర్ పర్సన్ మంజుశ్రీరెడ్డి తదితరులున్నారు.
లాక్డౌన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు ఏప్రిల్ 1న నుంచి 12 కిలోల బియ్యం, రూ. 1, 500నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. పంట కొనుగోలుకు జిల్లాకు ఐదు చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాన రహదారిపై కాలినడకన పర్యటిస్తూ.. కరోనా నివారణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైరస్ నివారణ ద్రావణాన్ని అగ్నిమాపక శకటాలతో పిచికారీ చేయించారు. మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: కరోనా వేళ ఒత్తిడిని ఎలా జయించాలంటే?