సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల సర్వే పనులను... ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. లింగంపల్లి, వెంకటాపూర్ శివారులో పనులు ప్రారంభించారు. ఎత్తిపోతల పథకాలతో జిల్లాలోని పంటపొలాలు సస్యశ్యామలం కానున్నాయి. రూ.16 కోట్లతో సంగమేశ్వర, రూ.11 కోట్లతో బసవేశ్వర సర్వే పనులు జరగనున్నాయి. 2 నెలల్లో సర్వే పనులు పూర్తిచేసి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) సిద్ధం చేసేలా అధికారులు ప్రణాళిక రచించారు.
కల్పతరువుగా...
ఒకప్పుడు మెదక్ జిల్లా అంటేనే కరవు ప్రాంతం గుర్తొచ్చేదని, ఈ ప్రాంత పరిస్థితులపై సీఎం కేసీఆర్కు పూర్తి అవగాహన ఉందని హరీశ్ అన్నారు. గత పాలకుల సమక్షంలో కరవు జిల్లాగా ఉన్న సంగారెడ్డిని.. కేసీఆర్ కల్పతరువుగా మార్చారని పేర్కొన్నారు. 20 టీఎంసీల కాళేశ్వరం జలాలతో సింగూర్ నింపుతామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
సంగమేశ్వర ద్వారా సింగూరు నుంచి 165 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయనున్నారు. చెరువులు, కుంటలు అనుసంధానిస్తూ 960 కిలోమీటర్ల మేర కాల్వల తవ్వకం చేపట్టనున్నారు. ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి జిల్లాలో 3.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఇదీ చదవండి: School paintings: బడిగోడలపై చేనేతకు పట్టంకట్టిన సిరిసిల్ల పాఠశాల