Harish Rao Inspected CM Tour Arrangements : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఈనెల 21న సీఎం కేసీఆర్ బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలతో నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలు పూర్తిగా సస్యశ్యామలం అవుతాయని అన్నారు. నాలుగు నియోజకవర్గాలలో 3.89 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలియజేశారు. సుమారు 4,500 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పాల్గొనే సభా వేదికను ఆయన పరిశీలించారు.
ఈ కార్య క్రమంలో కలెక్టర్ హనుమంతరావు, జిల్లా జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికారణ్, తెరాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Thara degree college : పాఠాలు వింటారు... డప్పుల దరువేస్తారు!