ETV Bharat / state

Harish Rao: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీర నీరందిస్తాం: హరీశ్​ రావు

ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్​ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలికలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

Minister Harish rao
Minister Harish rao
author img

By

Published : Jul 6, 2021, 9:52 PM IST

మంచినీళ్ల కోసం ట్యాంకర్ల వెంట పరుగెత్తాల్సిన పరిస్థితి ఇకపై రానివ్వమని మంత్రి హరీశ్​ రావు అన్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్​ ఇచ్చి అక్క, చెల్లెమ్మల కష్టాలను తీరుస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలికలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ప్రతి ఇంటికి మంజీర వాటర్

రాబోయే దసరా, దీపావళి నాటికి ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇస్తామని మంత్రి హరీశ్​ రావు హామీ ఇచ్చారు. పట్టణంలోని 11 వేల ఇళ్లకు రూ.45 కోట్లతో ట్యాంకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాబోయే 9 నెలల్లో రూ.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్​ను అందుబాటులోకి తెస్తామన్నారు. పట్టణంలోని సీసీ రోడ్లకు రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతులకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారని అన్నారు. 24 గంటలు కరెంటు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. నిధుల కొరత లేకుండా ప్రతి చిన్న గ్రామం కూడా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా వల్ల పనులు కొంత ఆలస్యం అయినప్పటికీ సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని ప్రజలకు హరీశ్​ రావు సూచించారు.

సదాశివపేట అభివృద్ధికి కృషి చేస్తా

సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సదాశివపేటలో సుమారు రూ.20 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పట్టణంలో ఊబ చెరువును రూ.5.5 కోట్లతో నిర్మించామన్నారు. సాయంత్రం వేళల్లో పాదచారులకు ఇబ్బంది కలగకుండా లైట్లు ఏర్పాటు చేసేందుకు తక్షణమే కోటి రూపాయలను మంత్రి ప్రకటించారు. డివైడర్ల మధ్య రూ.5 కోట్లతో లైటింగ్ ప్రారంభించామని అన్నారు. పట్టణంలో రూ.35 లక్షలతో లైబ్రరీని ఏర్పాటు చేశామని.. మహిళలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సదాశివపేటలో రూ.15 లక్షలతో ముస్లిం, క్రైస్తవ వైకుంఠ రథాలను వారంలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

"మన సదాశివపేట మున్సిపాలిటీలో దాదాపు రూ.75 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో రూ.45 కోట్లు మంచినీళ్ల పథకానికి కేటాయించాం. సదాశివపేటలోని 11 వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇస్తాం. ఇప్పటికే 4,500 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చాం. మా అక్క, చెల్లెమ్మలు ఎవరూ కూడా ట్యాంకర్ల కోసం వెళ్లే పరిస్థితి రాకుండా దసరా, దీపావళి నాటికి అందరికీ కనెక్షన్లు మంజూరు చేసి స్వచ్ఛమైన మంజీర నీళ్లు ఇప్పించే బాధ్యత నాది. మీకిచ్చిన మాట కోసం మాత్రమే ఇక్కడికి వచ్చా. కేవలం ఓట్ల కోసం నేను రాలేదు. సదాశివపేటలో పరిశుభ్రమైన ఇంటిగ్రేటెడ్​ వెజ్​, నాన్​వెజ్​ మార్కెట్ ఏర్పాటు చేస్తాం. 9 నెలల్లో మార్కెట్​ను అందుబాటులోకి తెస్తాం. ప్రతి మనిషి నిత్య విద్యార్థి. ప్రతి ఒక్కరూ సోషల్​ మీడియాలో మీ సమయాన్ని వృథా చేయకుండా విజ్ఞానాన్ని పొందేందుకు కేటాయించండి. మీ కోసం ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీని యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. కనీసం రెండు గంటలు చదవితే నిత్యజీవితంలో అది మనకు ఉపయోగపడుతుంది. 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పింఛను వచ్చేనెల నుంచే ఇవ్వనున్నాం. ప్రతి ఒక్కరూ కూడా టీకా తీసుకోవాలని కోరుతున్నా.

-- హరీశ్​ రావు, ఆర్థికశాఖ మంత్రి

ఇవీ చూడండి:

Pattana pragathi: ప్రజల మేలు కోసమే పట్టణ ప్రగతి: మంత్రి హరీశ్

HARISH RAO: ప్రతి ఒక్కరికి టీకాలు వేయించే బాధ్యత మీదే: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.