సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఈనెల 18వ తేదీలోగా చెల్లించాలని ట్రైడెంట్ కర్మాగారాన్ని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆ లోపు బకాయిలు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జహీరాబాద్ నాయకులు, ట్రైడెంట్ కంపెనీ ప్రతినిధులతో హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 9వేల మంది చెరుకు రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. ఇప్పటికే ట్రైడెంట్ యాజమాన్యంపై చెరుకు రైతులు విశ్వాసం కోల్పోయారని.... దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈనెల 11న ఐదు కోట్లు, 18న ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలని హరీశ్‌రావు ఆదేశించారు.
ఇదీ చూడండి: చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలంటూ రైతుల నిరాహార దీక్ష