ETV Bharat / state

సంగాపూర్​.. సింగపూర్​గా మారుతుంది: హరీశ్​రావు - లక్ష్మాపూర్​ గ్రామస్తులను ప్రశంసించిన మంత్రి హరీశ్​రావు

మల్లన్నసాగర్​ జలాశయం నిర్వాసితులకు ఇచ్చినట్లుగానే కొండపోచమ్మ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు హామీ ఇచ్చారు. గజ్వేల్ పట్టణ శివారులోని సంగాపూర్​లోని రెండు పడక గదుల ఇళ్లల్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్న తోగుట మండలం లక్ష్మాపూర్ గ్రామస్తులు దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు తెలుపుతున్నట్లు ఏకగ్రీవ తీర్మానాన్ని అందించే కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

harish rao at gajwel
సంగాపూర్​.. సింగపూర్​గా మారుతుంది: హరీశ్​రావు
author img

By

Published : Oct 4, 2020, 9:08 PM IST

మల్లన్న సాగర్ భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని.. మంత్రి హరీశ్​రావు అన్నారు. వారిని గుండెల్లో పెట్టి చూసుకుంటామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మ జలాశయం భూ నిర్వాసితులకు ఇచ్చినట్లుగానే ప్యాకేజీ ఇస్తామన్నారు.

గజ్వేల్ పట్టణ శివారులోని సంగాపూర్​లోని రెండు పడక గదుల ఇళ్లల్లో తాత్కాలిక నివాసం ఉంటున్న తోగుట మండలం లక్ష్మాపూర్ గ్రామస్తులు దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు తెలుపుతున్నట్లు ఏకగ్రీవ తీర్మానాన్ని మంత్రికి అందజేశారు.

మల్లన్న సాగర్​.. నిర్వాసితుల త్యాగం వల్లనే నేడు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చారు. ఇప్పుడు తెరాసకు మద్దతు పలికేందుకు ముందుకొచ్చారు. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ప్రభుత్వ పరంగా అందాల్సిన పరిహారాన్ని అందిస్తాం.

- హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థికమంత్రి

సంగాపూర్​.. సింగపూర్​గా మారుతుంది: హరీశ్​రావు

గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న పునరావాస కాలనీ పక్కనే కంపెనీలను ఏర్పాటు చేయించి నిర్వాసిత గ్రామస్తులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హరీశ్​రావు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడున్న సంగాపూర్​.. సింగపూర్​గా మారుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్​ వంటేరు ప్రతాపరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్​ చిట్టి దేవేందర్​రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇవీచూడండి: రాహుల్​గాంధీ.. భాజపాపై పోరాడమంటే.. ఇక్కడ మాత్రం..: హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.