ETV Bharat / state

ఆ ఎత్తిపోతల పథకాల డీపీఆర్​లు సిద్ధం చేయాలి: హరీశ్​ రావు - మంత్రి హరీశ్​ రావు వార్తలు

సాగు నీరు అందించేందుకు ప్రతిపాదించిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులపై మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్షించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్​లు సిద్ధం చేసి పంపించాలని సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆ ఎత్తిపోతల పథకాల డీపీఆర్​లు సిద్ధం చేయాలి: హరీశ్​ రావు

author img

By

Published : Mar 24, 2021, 2:37 AM IST

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్​లు సిద్ధం చేసి పంపించాలని సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రెండు నెలల్లో సర్వే పూర్తి చేసి పనులకు టెండర్లు పిలవాలని సూచించారు. సంగారెడ్డి, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగు నీరు అందించేందుకు ప్రతిపాదించిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులపై మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు. అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.

ఈ రెండు లిఫ్ట్ ల ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు నీరు అందుతుందని అధికారులు మంత్రికి వివరించారు‌. కొమరవెళ్లి మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు వచ్చే నీటిని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్ నియోజవర్గాలకు నీరందించే‌ లక్ష్యంతో‌ సీఎం కేసీఆర్ ఈ లిఫ్ట్​లకు శ్రీకారం చుట్టారని చెప్పారు. సంగారెడ్డి జిల్లా సర్కిల్ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 17, ప్యాకేజీ 18, ప్యాకేజీ 19 పనులు జరుగుతున్న తీరును మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: నల్లమలలో మంటలు... 80 హెక్టార్ల మేర అగ్నికి ఆహుతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.