ప్రతి మారుమూల గ్రామాల పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైద్యం వ్యాపారంలా కాకుండా సేవా దృక్పథంతో కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బాలాజీ మెడికోవర్ ఆసుపత్రిలో ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు.
సంగారెడ్డి పట్టణంలో వివిధ పార్టీల నుంచి నేతలు, కౌన్సిలర్లు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. అందరూ సామరస్యంతో పని చేయాలని మంత్రి కోరారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే అభివృద్ధి పథకాలను తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మల్కాపూర్ సమీపంలో సంయుక్తా ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బ్రాహ్మణ సంక్షేమానికి రూ.37 కోట్ల నిధులు మంజూరు