ETV Bharat / state

కేంద్రం ఇవ్వదు.. రాష్ట్రాన్ని కొననివ్వదు: హరీశ్​రావు

సంగారెడ్డి జిల్లా కల్వరి టెంపుల్​ చర్చిలో ఏర్పాటు చేసిన వంద పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

harish rao
harish rao
author img

By

Published : May 22, 2021, 5:32 PM IST

అమ్మ పెట్టదు... అడుక్కుని తిననివ్వదు అన్నట్లు కేంద్రం తీరుతో రాష్ట్రంలో వ్యాక్సిన్​ పంపిణీ తీరు ఇలా తయారైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్​ రోడ్డులో కల్వరి టెంపుల్​ చర్చిలో ఏర్పాటు చేసిన వంద పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని కల్వరి టెంపుల్ డైరెక్టర్ సతీశ్​కుమార్​తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ఇవ్వరు రాష్ట్రాన్ని కొనుక్కొనివ్వదు అన్నట్లు మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు 100 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో సమయానికి వ్యాక్సిన్ అందక టీకాల పంపిణీలో జాప్యం జరుగుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ విధించడంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికీ ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఈనెల 30 వరకు పొడిగించడం జరిగిందని అన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఒక రోజు బయటికి వచ్చి వారానికి సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

అనవసరంగా బయటికి వచ్చి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. కరోనా బాధితుల సహాయార్థం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సువిశాల ప్రార్థనా మందిరాన్ని ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు సతీష్ కుమార్ ముందుకు రావడాన్ని మంత్రి స్వాగతించారు. ఐసోలేషన్ కేంద్రంలో అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాలు తో పాటు ఆధునిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: 'బ్లాక్ ఫంగస్​ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.