సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదికను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ క్రమంలో చెత్త సేకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తడి పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి పద్మావతి, ఏపీఎం శ్రీనివాస్‌లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెత్త సేకరణలో నిర్లక్షం వహించిన నందిగామ గ్రామ కార్యదర్శి పద్మావతి, ఏపీఎం శ్రీనివాస్‌లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు. వారితో పాటుగా ఏపీఓ రాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇదీ చదవండి: పోడు రైతుల బతుకును బజారుకీడ్చొద్దు : కోదండరాం