పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన హరీశ్ - పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి హరీశ్
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవడం మన కనీస బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో కార్మికులను సన్మానించారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను ఓ చిన్నారి మంత్రికి అందించింది.
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన హరీశ్
సంగారెడ్డి జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులను మంత్రి హరీశ్ రావు సన్మానించారు. కార్మికులకు కొత్త బట్టలు అందించారు. కరోనా నిర్మూలనలో కార్మికుల సేవలు అమోఘమని కీర్తించారు. కరోనాకు భయపడకుండా... మన కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవడం మన కనీస బాధ్యత అన్నారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను ఈ సదర్భంగా ఓ చిన్నారి మంత్రికి అందించి అందరి ప్రశంసలు పొందింది.
ఇవీ చూడండి: కొవిడ్ కంట్రోల్ రూంను పరిశీలించిన కేంద్ర బృందం