ETV Bharat / state

Harish Rao On CM KCR : 'కేసీఆర్​ కాలు పెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది'

Harish Rao On CM KCR : రాముడు ఎక్కడ కాలుపెడితే రాయి అహల్య అయిందని రామాయణంలో చెప్పేవారని. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్​.. ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతున్నట్లు నేటి చరిత్ర చెబుతుందని మంత్రి హరీశ్​రావు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్​ఖేడ్​లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ్​ఖేడ్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

Harish Rao
Harish Rao
author img

By

Published : Feb 21, 2022, 5:58 PM IST

Harish Rao On CM KCR : ఒకప్పుడు అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్న సంగారెడ్డిలో... ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో​ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని మంత్రి హరీశ్​రావు అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు సంగారెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్​ఖేడ్​లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ్​ఖేడ్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం నాయకత్వంలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయని... రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందడమే కాకుండా.. ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చిందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రజల సాగునీటి కష్టాలను తొలగించేందుకు రూ.4 వేల కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణానికి సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేశారని అన్నారు. మంజీరాలో వరద వస్తే ఆ నీళ్లు గోదావరిలో కలవడమే మనకు తెలుసని, కానీ... గోదావరి నీళ్లను వెనక్కు మళ్లించి మంజీరాలో కలిపే ఓ మహా అద్భుతాన్ని సీఎం కేసీఆర్​ ఆవిష్కరించారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషితో నారాయణ్‌ఖేడ్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. నారాయణ్‌ఖేడ్‌లో 54 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. సంగారెడ్డి జిల్లాలో 699 పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వాలి. జహీరాబాద్‌, సంగారెడ్డి మున్సిపాలిటీలకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలి. మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 లక్షల చొప్పున నిధులు ఇవ్వాలి. -హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి.

'కేసీఆర్​ కాలు పెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది'

ఇదీ చూడండి : Sangameshwara And Basaveshwara : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.