నిర్దేశించిన గడువులోగా గుత్తేదారులు అభివృద్ధి పనులు పూర్తి చేయకపోతే వేరే కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్తో కలసి సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు.
వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా ఏర్పాటు చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. అంతర్గత దారులు, వైకుంఠ గ్రామాలు డివైడర్ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అన్నారు.
ఇవీ చూడండి: త్వరలో టీస్బీపాస్ తీసుకొస్తాం: కేటీఆర్