14 ఏళ్ల క్రితం కెఫే ఎథ్నిక్ పేరుతో రెస్టారెంట్‌నూ ప్రారంభించారు. చిరుధాన్యాలతో చేసిన వంటకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. జనవరిలో మిల్లెట్స్ దోశ ఫెస్ట్ నిర్వహించారు. ఫిబ్రవరిలో రొట్టెల పండుగ జరుపుతున్నారు.
జొన్న, గోధుమ, బెరికె, సజ్జ, నువ్వులు, పాలకూర, మెంతికూర, సోరకాయ రొట్టెలను తయారు చేస్తున్నారు. వీటితో పాటు రాగి, మల్టీ మిల్లెట్ దోశ, పులిహోర, కొర్ర బిర్యానీ, జొన్న పెసర ఇడ్లీ, అనుప గుడాలు, మిల్లెట్ పకోడి వంటి భిన్నరుచులు అందిస్తున్నారు.
పదార్థాల్లో ఉండే పౌష్ఠిక విలువలు వివరిస్తూనే ఎలా తయారు చేయాలో చెబుతున్నారు. ఈ ఫెస్ట్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి భోజన ప్రియులు తరలొచ్చి లొట్టలేసుకుంటు తింటున్నారు.
మొదటి ఆరు నెలలు కెఫే ఎథ్నిక్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది డీడీఎస్ సంస్థ. తర్వాతి ఆరు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రాంతాలను ఎంపిక చేసి ఆహారోత్సవాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.