సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గ కేంద్రంలోని వలస కూలీలు ఒక్కసారిగా పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ దరఖాస్తు పత్రాల కోసం ఎగబడ్డారు. కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రి మైదానంలో గుమిగూడారు. దాదాపు వెయ్యికి పైగా వలస కూలీలు అక్కడికి రావడం వల్ల పరిస్థితి గందరగోళంగా మారింది. దరఖాస్తు పత్రాల కోసం భౌతిక దూరం పాటించకుండా వలస కూలీలు ఎగబడుతుంటే పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు. వాటర్ ప్యాకెట్లు, భోజనం కోసం కూడా క్యూ లైన్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా ఎగబడడం కనిపించింది. వలస కూలీలు ఒకచోట గుమిగూడి హంగామా సృష్టిస్తున్నా.. పోలీసులు మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు.
భౌతిక దూరం పాటించని వలస కూలీలు
స్వస్థలాలకు పంపించాలంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు పెద్ద ఎత్తున వలస కూలీలు తరలివచ్చారు. భౌతిక దూరం పాటించకుండా దరఖాస్తు పత్రాల కోసం ఎగబడ్డారు.