ETV Bharat / state

ప్రైవేటు పాఠశాల ప్రకటనలో ప్రభుత్వ అధికారి ఫోటో - private school

ప్రభుత్వ బడిలో  విద్యార్థులను చేర్పించాలని ఓ పక్క బడిబాట కార్యక్రమం  నిర్వహిస్తుంటే ఓ ప్రైవేటు పాఠశాల తమ ప్రచారం కోసం ఇచ్చిన ప్రకటనలో మండల విద్యాధికారి ఫోటో ప్రచురించడం వివాదాస్పదమైంది. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ప్రైవేటు పాఠశాల ప్రకటనలో ప్రభుత్వ అధికారి ఫోటో
author img

By

Published : Jun 19, 2019, 12:19 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం బీరంగూడ సాయి బాబా కాలనీకి చెందిన శ్రీ నారాయణ పాఠశాలలో ప్రవేశాల కోసం బ్యానర్లను ఆయా కూడళ్లలో కట్టారు. అందులో మండల విద్యాధికారి రాథోడ్ ఫోటో ప్రచురించడం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని బడి బాటలో భాగంగా అధికారులు కృషి చేస్తుంటే మరోపక్క ప్రభుత్వ అధికారి ఫోటోను తమ పాఠశాల చేరికల బ్యానర్​లో పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. ఎంఈవో రాథోడ్​ను వివరణ కోరగా.. అనుమతి లేకుండా తన ఫోటో చిత్రీకరించారని దీనిపై ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు ఇలాంటి ప్రకటనలు చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పారు.

ప్రైవేటు పాఠశాల ప్రకటనలో ప్రభుత్వ అధికారి ఫోటో

ఇవీ చూడండి: ఆ పాఠశాలంటే ఇష్టపడని పిల్లలుండరు..

Intro:hyd_tg_15_19_meo_vivadam_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ప్రభుత్వ బడిలో విద్యార్థులు చేర్పించాలని ఓపక్క బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటే ఓ ప్రైవేటు పాఠశాల చేరికల కోసం ప్రకటన ఇచ్చిన బ్యానర్లో మండల విద్యాధికారి ఫోటో ప్రచురించడంతో వివాదం చోటు చేసుకుంది ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ సాయి బాబా కాలనీకి చెందిన శ్రీ నారాయణ పాఠశాల ల చేరికల కోసం ప్రచురించిన బ్యానర్లను ను ఆయా కూడళ్ళలో కట్టారు అయితే అందులో మండలం విద్యాధికారి రాథోడ్ ఫోటో ప్రచురించడం వివాదానికి దారి తీసింది ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలని బడి బాట లో భాగంగా ర్యాలీలు అవగాహనలు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలు వివరించి కృషి చేస్తుంటే మరోపక్క ప్రభుత్వ అధికారి ఫోటోను తమ పాఠశాల చేరికల బ్యానర్లో పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది దీంతో ఎం ఈ ఓ రాథోడ్ ను వివరణ కోరగా అనుమతి లేకుండా డా తన ఫోటో చిత్రీకరించారని దీనిపై ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు ఇలాంటి ప్రకటనలు చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పారు

Conclusion:బైట్ రాథోడ్ మండల విద్యాధికారి పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.