ప్లాస్టిక్ నివారించి కొయ్యబొమ్మలకు ప్రాచుర్యం కల్పిస్తే క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న గూడెంలో హస్తకళల సమీకృత సమన్వయ కేంద్రాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఆస్తులు సంపాదించడం కంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కష్టమని.. ఆరోగ్యంగా ఉండే విధంగా మన జీవనశైలి మార్చుకోవాలని ఎంపీ సూచించారు.
మొక్కలకు బదులుగా
ప్లాస్టిక్ బొమ్మల వాడకంతో క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోందని ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి బదులుగా కొయ్యబొమ్మలకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సమావేశాల్లో మొక్కలకు బదులుగా కళాకృతులు కలిగిన బొమ్మలను ఇస్తే చేతివృత్తుల వారికి ఉపాధి కల్పించడంతో పాటు కొయ్యబొమ్మలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కౌజుపిట్టలతో నెలకు రూ. 75 వేల ఆదాయం