సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కర్మాగారంలో పది లక్షల వాహనాలు ఉత్పత్తి పూర్తవటంతో "వన్ మిలియన్ వెహికల్ రోలింగ్ సెలబ్రేషన్స్" పేరిట సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి మహీంద్రా అమ్మకాల్లో అత్యధికమైన బొలెరో వాహనానికి పూల జల్లు కురిపించారు. గత మూడేళ్ల క్రితం ఉత్పత్తి ప్రారంభించిన మహేంద్ర జీతో లక్ష వాహనాల అమ్మకాలు పూర్తవడం సందర్భంగా కేకు కోసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్మికులు, అధికారులు అంకితభావంతో పని చేయటంతోనే వన్ మిలియన్ లక్ష్యం పూర్తయిందని ఆటోమోటివ్ ప్రెసిడెంట్ రాజన్ వాదేరా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతేనా...?