సాధారణంగా దేవుడికి నైవేద్యం, కానుకలు సమర్పించి... మొక్కులు చెల్లించుకుంటారు. కానీ మహారాష్ట్రకు చెందిన కొంతమంది భక్తులు మాత్రం... కొరడా దెబ్బలు కొట్టుకుంటూ మొక్కులు చెల్లించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్ర నుంచి సంగమేశ్వరం తరలివచ్చిన భక్త బృందం... డప్పువాద్యాలు, తాళాల మధ్య కొరడాలతో తమని తాము కొట్టుకున్నారు. ఆ తర్వాత ఎదుటువారిని కొట్టారు. ఇది తమ కుటుంబ ఆచారమని తెలిపారు. ఈ వింత ఆచారాన్ని చూసి స్థానిక భక్తులు ఆశ్యర్చపోయారు.
ఇదీ చూడండి: Allu Aravind, Sukumar met governor : పుష్ప చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం